వర్ష - ఇమ్ము మధ్య శ్రీకర్ కృష్ణ...వాళ్లకు బ్రేకప్ అయ్యిందా ?
on Dec 17, 2024
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రోమో ఫైనల్ లో ఒక ట్విస్ట్ ఐతే ఉంది. జబర్దస్త్ లో నటించే వర్ష - ఇమ్మానుయేల్ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళ మధ్య ప్రేమ ఉందని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని విషయం ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. ఐతే ఇమ్ము మాత్రం వర్షని ఎంతసేపు అమ్మాయి కాదు అని అబ్బాయి అంటూ కామెంట్ చేస్తూ హర్ట్ చేస్తూ ఉంటాడు. ఐతే మరి వర్ష - ఇమ్ము మధ్య ఏమయ్యిందో కానీ వర్ష కోసం వకాల్తా పుచ్చుకున్నాడు శ్రీకర్ కృష్ణ..బుల్లితెర నటుడు...బ్రహ్మముడి సీరియల్ లో రాహుల్ గా చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు. ఇక ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో వర్ష ఒక స్కిట్ వేసింది.
అందులో ప్రేమించిన వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. దానికి వర్ష చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శ్రీకర్ కృష్ణ వస్తాడు. "ఇన్ని రోజులుగా నిన్ను కించపరిచేవాడి కోసం అంతగా పరితపించి పోయి ఏమన్నా నువ్వు అర్ధం చేసుకుని వదిలేస్తున్నావ్. అలాంటిది నా కోసం ఒక్కసారి ఆలోచించొచ్చు కదా.. ఈ సెట్టు సాక్షిగా అడుగుతున్నా నాతో వస్తావా. " అంటూ వర్షతో కలిసి డాన్సులు వేసాడు. శ్రీకర్ కృష్ణ వేసిన డైలాగ్స్ కి సెట్ మొత్తం చప్పట్లు కొట్టింది. ఆటో రాంప్రసాద్ కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఇక తనతో ఉండమని శ్రీకర్ అడిగేసరికి వర్ష ఐతే అదేదో నమ్మలేని అంశంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఇక నెటిజన్స్ ఐతే ఏంటి ఇమ్ము-వర్ష మధ్య బ్రేకప్ అయ్యిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read